అక్కడ జనవరి 7న క్రిస్మస్

ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్-25న క్రైస్తవులంతా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా బంధువులను కలవడం.. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం.. స్వీట్లు పంచుకోవడం ఇవి దాదాపుగా అన్ని చోట్ల జరిగేవే. అయితే అక్కడ మాత్రం క్రిస్మస్‌ ను వేరే రోజున జరుపుకోనున్నారట. ప్రపంచమంతా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ జరుపుకొంటే.. రష్యా, ఉక్రెయిన్‌ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనవరి 7న క్రిస్మస్‌ జరుపుకుంటారు.

ఆర్థోడాక్స్‌ సంప్రదాయాలు పాటించే చర్చిల్లో 40 రోజుల ముందుగానే ఈ వేడుకలు ప్రారంభిస్తారు. జనవరి 6 సాయంత్రం తొలి నక్షత్రం కనిపించేంత వరకూ ప్రార్థనలు జరుపుతారు.

 

Posted in Uncategorized

Latest Updates