అక్కడ నమాజ్ చేయవద్దు : నోయిడా పార్కులో మత ప్రార్థనలు నిషేధం

ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా సెక్టార్-58 లో ఉన్న పార్కుల్లో, పబ్లిక్ ఏరియాల్లో నమాజు చేయకూడదని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. స్థానికంగా ఉన్న కంపెనీల ఉద్యోగులు నమాజు చేయడానికి పార్కులను వాడుతున్నారని పొలీసులు తెలిపారు. పబ్లిక్ స్థలాలు అన్ని  మతాల ప్రజలకు చెందినవని అక్కడికి అందరూ వస్తారు కనుక వేరే మతాలవారికి ఇబ్బంది  ఉండకూడదనే నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్పారు.

తాము ఇచ్చిన ఆర్డర్స్ ను ఉల్లంఘిస్తే.. కంపెనీలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇది ముస్లింకు మాత్రమే వర్తించదని అన్ని మతాలకు చెందుతుందని యూపీ పోలీసులు తెలిపారు.

పోలీసుల ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లడానికి ఆయా కంపెనీలు రెడీ అవుతున్నాయి. దీంతో.. తాము ఇచ్చిన ఆదేశాలకు  మతపరమైన రంగు పులమొద్దని పోలీసులు అన్నారు.  కొన్ని రోజుల క్రితం ఆయా కంపెనీలు బహిరంగ నమాజు కు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాయి. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

Posted in Uncategorized

Latest Updates