అక్కడ బ్యాచిలర్సే : సౌదీ నుంచి తరలి వస్తున్న కుటుంబాలు

sudసౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ వర్కర్లు తమ ఫ్యామిలీలను తిరిగి స్వస్ధలాలకు పంపించేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి సౌదీలో నివసిస్తున్న వారిపై సౌదీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన టాక్స్ విధానమే ఇందుకు కారణమైంది. తమ దేశంలో పెరుగుతున్న వీదేశీ జనాభాను తగ్గించుకోవడానికి సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సౌదీ NRIల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది.

ప్రస్తుతం ఒక డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్ 100 సౌదీ అరేబియన్ రియాల్ కడుతుండగా, జులై-1 నుంచి ఒక్కో ఫ్యామిలీ మెంబర్ 200 రియాల్స్ కట్టాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. జులై-1,2019 నుంచి 300 రియాల్స్,  జులై-1,2020 నుంచి 400 రియాల్స్ కట్టాలని సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 32.5 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాలో నివసిస్తున్నారు. అందులో ఎక్కువగా 40 శాతం మంది మళయాళీలు ఉండగా, 20-25 శాతం మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ ల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సౌదీ నిర్ణయంతో బెంబేలెత్తిపోయిన భారతీయులందరూ తమ ఇంట్లో నలుగురు కుటుంభసభ్యులు ఉంటే తాము సంపాదించింది అంతా ప్రభుత్వానికే కట్టాల్సి వస్తుందని, ఇంక తమకు ఏం మిగులుతుందని, తిరిగి స్వస్ధలాలకు వెళ్లడమే కరెక్ట్ అని నిర్ణయించుకుని తమ కుటుంభసభ్యులను స్వస్ధలాలకు పంపిచేస్తున్నారు. హైదరాబాద్ స్కూళ్లల్లో NRIల పిల్లల రష్ పెరిగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates