అక్కడ మద్య నిషేధంతో పెరిగిన ఆస్తులు

Banబీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా తర్వాత సక్సెస్ గా అమలవుతోంది. చాలా మంది తాగుడును మానుకున్నారు. అంతేకాదు మందుకోసం ఖర్చు చేసే డబ్బులను వారి ఉన్నతి కోసం ఖర్చు చేస్తున్నారు. ఖరీదైన బట్టలు కొనుగోలు కోసం ఖర్చుపెట్టడం ఎక్కువైంది. మద్యనిషేధం విధించిన మొదటి 6నెలల కాలంలో ఖరీదైన చీరల కొనుగోళ్లు 1,751 శాతం, తేనె 380 శాతం, జున్ను 200 శాతం పెరిగినట్లు ‘ఆసియా అభివృద్ధి పరిశోధనా సంస్థ (ADRI) నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. మద్యనిషేధ తర్వాత పరిణామాలపై అధ్యయనానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏడీఆర్‌ఐతో పాటు అభివృద్ధి నిర్వహణ సంస్థ(DMI) కి బాధ్యతలు అప్పగించింది. ఒకప్పుడు మద్యంపై ఎడాపెడా ఖర్చుచేసిన జనం ఇప్పుడు ఆ మొత్తాలతో ఎవరి స్థాయిలో వారు కొత్తకొత్త వస్తువులతో పాటు ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. బీహారులో 2016లో మద్యనిషేధం విధించింది. ముఖ్యంగా గ్రామీణ మహిళల నుంచి పదేపదే అందిన అభ్యర్థనల క్రమంలోఅక్కడ మద్యనిషేధం ప్రకటించారు.

Posted in Uncategorized

Latest Updates