అక్టోబర్ వరకు యాదాద్రి పనులు పూర్తి

YADADRIసెప్టెంబర్ నెలాఖరువరకు యాదాద్రి ఆలయ పనులు పూర్తిచేస్తామన్నారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అక్టోబర్ నాటికి నాలుగు రాజగోపురాలతో సహా ప్రధానాలయం పునర్నిర్మాణం పూర్తవుతుందన్నారు. స్వయంభూ నరసింహుడి దర్శనాల పునరుద్దరణపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం (మే-23) ఉదయం కొండపై నరసింహుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత.. గుట్టపైన ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి.. వైటీడీఏ అధికారులతో రివ్యూ చేశారు.

Posted in Uncategorized

Latest Updates