అక్టోబర్-1నుంచి దేశవ్యాప్తగా పశుగణన 

దేశవ్యాప్తంగా ఉన్న పశువులను లెక్కించేపనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే 20వ పశుగణన కార్యక్రమాన్ని అక్టోబర్ -1 నుంచి ప్రారంభించనుంది. ఈ సారి జాతుల వారి వివరాలతో గణన ఉంటుందని నిన్న (సెప్టెంబర్-28)న తెలిపింది కేంద్ర వ్యవసాయ శాఖ. ట్యాబ్‌ లెట్/కంప్యూటర్ల ద్వారా వివరాలు సేకరించాక, ఇంటర్నెట్ బదిలీకి అనువుగా మొబైల్ యాప్‌ ను సిద్ధం చేసినట్టు వివరించింది.

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటి వరకు 19 సార్లు పశుగణనను చేపట్టాయి. 2012లో చివరిసారిగా గణన జరిపాయి. పశుగణన అన్నిగ్రామాలు, పట్టణ వార్డుల వారీగా జరుగుతుందని, వివిధ జంతు జాతులు.. పెంపుడు పశువులైన ఆవు, ఎద్దు, గేదె, దున్న, అడవి దున్న, మేక, గొర్రె, పంది, గుర్రం, కురుచ గుర్రం, గాడిద, ఒంటె, కుక్క, కుందేలు, ఏనుగులతో పాటు.. పెంపకం కేంద్రాల్లోని కోళ్లు, పక్షులు, బాతులు, ఈము, టర్కీ పక్షులు తదితరాల సమగ్ర వివరాలను లెక్కిస్తారు.

Posted in Uncategorized

Latest Updates