అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి సెక్రటేరియట్ లో  అధికారులతో సమీక్ష జరిపారు. అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ప్రధానమైన సద్దుల బతుకమ్మ పండుగను 17వ తేదీన హైదరాబాద్ తో పాటు.. అన్ని జిల్లాల్లో గ్రాండ్ గా నిర్వహించాలని సూచించారు సీఎస్ జోషి.

మరోవైపు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలు ఇప్పటికే హైదరాబాద్ సహా.. జిల్లాలకు చేరుకున్నాయి. గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలను  పంపిణీ చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates