అక్టోబర్ 2న అన్నా హజారే నిరాహార దీక్ష

సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అవినీతిని నిరోధించేందుకు లోక్‌పాల్ నియామకంలో జాప్యానికి నిరసనగా అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లోక్‌పాల్ కోసం దీక్ష చేపట్టనున్నట్లు ఆదివారం (జూలై-29) ప్రకటించారు.  లోక్‌పాల్ బిల్లుకు 2014 జనవరిలో రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే లోక్‌పాల్ వ్యవస్థను నియమిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలుపుకోలేదని ఆరోపించారు అన్నా హజారే.

Posted in Uncategorized

Latest Updates