అక్టోబర్ 2న దీక్ష చేపడతా : అన్నా హజారే

లోక్ పాల్ బిల్లు కోసం మరోసారి దీక్షకు దిగనున్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జయంతి సందర్భంగా… అక్టోబర్ 2న దీక్ష చేపడతానని ప్రకటించారు. లోక్ పాల్ వ్యవస్థను నియమిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నది హజారే డిమాండ్. 2011లో అన్నా హాజరే ఉద్యమానికి కేంద్రం దిగొచ్చింది. 2013లో లోక్ పాల్ బిల్లును తీసుకొచ్చింది. లోక్ పాల్ యాక్ట్ ను అమలు చేస్తే దేశంలో అవినీతిని 60-70 శాతం తగ్గించొచ్చన్నది హజారే అభిప్రాయం.

Posted in Uncategorized

Latest Updates