అక్టోబర్- 3 నుంచి కేసీఆర్‌ ప్రజాయాత్ర

తెలంగాణలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ పార్టీ భారీఎత్తున ప్రచారానికి తెరలేపింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు మరింత ఊపు తెచ్చేలా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రచార బరిలో దిగనున్నారు.  ఉమ్మడి జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. అక్టోబర్- 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐదు జిల్లాల్లో సభలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ ను  ఖరారు చేశారు.

టీఆర్‌ఎస్ పార్టీ 105 అసెంబ్లీస్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు.. వారికి పార్టీ ప్రచార సామగ్రిని కూడా అందించింది. దీంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖరారు కాకముందే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ఒక ట్రిప్ ప్రచారాన్ని పూర్తిచేశారు. గ్రామాల్లో ప్రచారం చేస్తూ ..పభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, వాటి ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభలతో ఈ ప్రచారానికి మరింత ఊపు రానున్నది.

 

Posted in Uncategorized

Latest Updates