అక్బరుద్దీన్ ఒవైసీకి అస్వస్థత

 హైదరాబాద్ : చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే , ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ ఒవైసీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్‌కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కంచన్‌ బాగ్‌ లోని ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఢిల్లీ నుం చి హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నా రు. ఆస్పత్రికి వెళ్లి అక్బరుద్దీన్‌ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది . శనివారం ఆయన తీవ్రంగా ఇబ్బంది పడటంతో ఈ విషయం బయటికి తెలిసింది . 2011 ఏప్రిల్ 30న దాడి జరిగినప్పటి నుం చి అక్బరుద్దీన్‌ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ తన కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ చేయిం చుకోవాలని డాక్టర్లు సూచిం చారని చెప్పా రు. ఈ ప్రకటన ఎంఐఎం శ్రేణులను ఆందోళనకు గురి చేసింది . అక్బరుద్దీన్ మరోసారి ఆసుపత్రి పాలవడం అభిమానుల్ని కలవరపెడుతోంది .

Posted in Uncategorized

Latest Updates