అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

ఖమ్మం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం పోలీసులు. పెనుబల్లి మండలం వీయం బంజర్ వద్ద డీసీఎంలో వైరా నుంచి రాజమండ్రికి బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీసీఎంలో 115 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఆ డీసీఎంను సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates