అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. మహారాష్ట్రలోని విరూర్ లో దిగుమతి చేస్తుండగా గురువారం 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

ట్రైన్లలో బియ్యాన్ని తరలిస్తున్నారని పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేసి, రూ. 8 లక్షల విలువైన బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రాజేశం.. కాగజ్ నగర్ ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎంబీ రాథోడ్ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని కాగజ్ నగర్ తరలించారు.

Posted in Uncategorized

Latest Updates