అక్రమంగా ఫ్లిప్‌కార్ట్‌ మా ఉత్పతులు అమ్మేస్తోంది

ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఆమ్ వే షాక్‌ ఇచ్చింది. భారతీయ ఇ-కామర్స్ నిబంధనలకు ఇరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్‌ తమ ఉత్పత్తులను అనధికారికంగా అమ్ముతోందని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సంస్థ ఆమ్ వే ఆరోపిస్తోంది. ముందస్తు పర్మిషన్ లేకుండా లేకుండా అక్రమంగా తమ ప్రొడక్ట్స్‌ను అమ్ముతోందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ ఉత్పత్తుల క్యాపులపై  ఫ్రింట్ చేసిన యూనీకోడ్‌, సిల్వర్‌ ఫోయిల్‌ సీల్స్‌ను టాంపర్‌ చేసి మరీ అక్రమం సేల్స్ కు పాల్పడుతోందని ఆమ్ వే విమర్శించింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates