అక్రమ ఆస్తుల కేసు : లొంగిపోయిన పురుషోత్తం రెడ్డి

purishothamreddyఆదాయానికి మించిన ఆస్తుల కేసులో HMDA డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. పురుషోత్తంరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన గత కొంతకాలంగా పరారీలో ఉన్నారు. రూ50కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టిన కేసులో పురుషోత్తం రెడ్డి నిందితుడిగా ఉన్నారు. రెండు వారాల క్రితం ఆయనతో పాటు బంధువుల ఇళ్లపై దాడులు చేసిన అనిశా అధికారులు పెద్దయెత్తున నగదు, ఆస్తుల పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఆయనకు బినామీలుగా ఉన్న ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రెండు వారాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న పురుషోత్తంరెడ్డి శుక్రవారం అనూహ్యంగా ఏసీబీ న్యాయస్థానంలో లొంగిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆయన ముందస్తు బెయిల్‌ కోసం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. పురుషోత్తంరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని ACB అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Posted in Uncategorized

Latest Updates