అక్రమ కట్టడాల కూల్చివేత.. ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

 హైదరాబాద్ : ఎన్నికల ప్రక్రియ ముగియడంతో… జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో అధికారులు మళ్లీ బిజీ అయ్యారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర, సిబ్బంది… రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ కట్టడాలను సోమవారం పడగొట్టారు.

రాయదుర్గం ‘పైగా’ భూముల్లోని సర్వే నంబర్ 46లో 84 ఎకరాల 30గుంటల స్థలం ఉంది. ఈ స్థలం విషయంలో ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న వివాదంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ భూమి ప్రభుత్వానిదే అని కోర్టు తేల్చేసింది. దీంతో.. ‘పైగా’ భూముల్లో ఇప్పటికే ఉన్న పశువుల పాకలు, ప్రహారీలు, ఇతర నిర్మాణాలను రెవెన్యూ శాఖ కూల్చేసింది.

ఇక్కడే సినిమా హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ కూడా ఉంది. అధికారుల కూల్చివేతల సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో…. ప్రభాస్ గెస్ట్ హౌజ్ ను సీజ్ చేశారు అధికారులు. ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నట్టుగా గేటుకు నోటీసు అంటించారు. 2వేల 2వందల గజాల్లో ఈ గెస్ట్ హౌజ్ నిర్మాణం జరిగింది. జీవో నంబర్ 59 కింద.. ఈ ఇంటిని రెగ్యులరైజ్ చేయాలని యజమానులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

 

Posted in Uncategorized

Latest Updates