అక్రమ తవ్వకాల వల్ల బొగ్గు గనిలో చిక్కుకున్న 13 మంది కార్మికులు

మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో 13 మందికార్మికులు చిక్కుకుపోయారు. ఆ గని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఉంది. అక్కమ తవ్వకాలు చేస్తున్న ఈ గనికి ప్రభుత్వ అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 2014 లోనే గ్రీన్ ట్రైబ్యునల్ నిషేధించిందని చెప్పారు. కార్మికులు గనిలో చిక్కుకుని మూడు రోజులు అవుతుందని ఇప్పటికే కార్మికులు ప్రాణం విడిచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఒక్కసారిగా వరదలు రావడంతో 13 మంది కార్మికులు గనిలో చిక్కుకున్నారని… నిషేధిత గనిలో అక్రమ తవ్వకాలు జరపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.  అక్రమంగా తవ్వకాలు చేపడుతోన్న ఆ గని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఆ ఘటనపై జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates