అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా : తిరుమల శ్రీవారికి 3 రోజులు జ్యేష్టాభిషేకాలు

tirతిరుమల శ్రీవారికి ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రతీఏటా జేష్ఠ మాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ఈ ఉత్సవం నిర్వహించటం సంప్రదాయంగా వస్తుంది. ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో చేపడతారు. ఈ కార్యక్రమాన్ని అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారని తిరుమల పురోహితులు చెబుతున్నారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా ఇవాళ వసంతోత్సవం, రేపు విశేషపూజ,26న అష్టదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. స్వామివారి సేవలను కనులారా తిలకిందుకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

Latest Updates