అగ్నికి ఆహుతులైన ఐదుగురు చిన్నారులు

యూఎస్ : అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మరణించిన ఘటన యూఎస్ లో జరిగింది. ఆదివారం రాత్రి  ఒహియోలో జరిగిన ప్ర‌మాదంలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్ర‌మాదంతో ఏం చేయాలో తోచ‌ని ఆ చిన్నారుల‌ త‌ల్లి డెబొరా రివెరా..మంట‌ల బారి నుంచి త‌ప్పించుకునేందుకు రెండో అంత‌స్తుపై నుంచి కిందికి దూకింది. ఆమెకు తీవ్ర‌గాయాల‌య్యాయి.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క అధికారులు గాయాలైన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అధికారులు మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. మృతి చెందిన చిన్నారుల్లో ఇద్ద‌రు క‌వ‌ల‌లున్నారు. చిన్నారులంతా 9 ఏండ్లలోపు వారే. డెబొరా రివెరా త‌న కుటుంబంతో క‌లిసి 6 నెల‌ల క్రిత‌మే ప్ర‌మాదం జ‌రిగిన ఇంటిలోకి మారింది. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ఇళ్లు 90 ఏండ్ల క్రితం చెక్క‌తో క‌ట్ట‌బ‌డింద‌ని ఆమె స్నేహితుడు జ‌స్టిన్ వీరా తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates