అగ్నిప‌ర్వ‌తం ఇలా పేలింది : ఇండోనేషియాలో 281కి చేరిన మృతులు

ఇండోనేషియాలో సునామీ సృష్టించిన బీభత్సంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇండోనేషియా అధికారుల తాజా లెక్కల ప్రకారం…చనిపోయిన వారి సంఖ్య 281కి చేరింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైనవారు కూడా చాలా మందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

వందల సంఖ్యలో భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ వచ్చింది. సునామీ కారణంగా… దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాల్లోని బీచ్ లలో అలలు భారీగా ఎగసిపడ్డాయి.

ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు చనిపోయారు. చుట్టుపక్కల భవనాలు ధ్వంసమయ్యాయి. సునామీతో… సుమత్రా, జావా దీవుల్లో అంధకారం ఏర్పడింది. ఆ దీవుల మధ్య ఉన్న క్రాకటోవా అగ్నిపర్వతం పేలడంతోనే సునామీ వచ్చినట్టు గుర్తించారు. క్రాకటో వా నుంచి వెలువడిన లావా, బూడిద ఆకాశంలో 500 మీటర్ల దూరం వరకు ఎగిసి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పేలుడు ధాటికి సముద్ర గర్భంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతోనే సునామీ వచ్చినట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు, ఇండోనేషియా సునామీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించించింది. సునామీ వచ్చినప్పుడు 20 అడుగుల ఎత్తులో అలలు వచ్చాయని చెబుతున్నారు. ఇండోనేషియాలో తరచుగా ప్రకృతి విపత్తులు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే భూకంపం, సునామీ కలసిరావడంతో 2 వేలకు పైగా జనం చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారు.

https://youtu.be/V3PSkKEmJos

 

Posted in Uncategorized

Latest Updates