అగ్ని-1 మిసైల్ సక్సెస్

agni-kyPB--621x414@LiveMintఅత్యాధునిక అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన  అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్ ను ఈ రోజు (ఫిబ్రవరి 6)  విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని బాలసోర్‌లో ఉన్న అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా ఈ ప్రయోగం చేశారు భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలగడం ఈ మిసైల్ ప్రత్యేకత. అగ్ని-1లో ఇది 18వ వెర్షెన్ మిసైల్. నిర్ణీత సమయంలోనే మిసైల్ టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా సైనిక దళాలు ఈ మిస్సైల్‌ను పరీక్షించారు. అతి తక్కువ సమయంలోనే ఈ మిస్సైల్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. లక్ష్యాన్ని అత్యంత పకడ్బందీగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 మిస్సైల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేంజ్, ఆక్యురెసీలో అగ్ని -1 అత్యుద్భత ప్రదర్శన జరిపినట్లు అధికారులు తెలిపారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 12 టన్నుల బరువు ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates