అగ్రరాజ్యానికి ఝలక్ : అమెరికాకు ధీటుగా.. సుంకాలు విధించిన భారత్

indo-usఅగ్రరాజ్యం అమెరికా – చైనా దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలైంది. వివిధ రకాల వస్తువులపై సుంకాలను పెంచుకుంటూపోతున్నాయి రెండు దేశాలు. చైనా నుంచి దిగుమతి అయ్యే 50 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం(జూన్-15) అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అదే మొత్తానికి సమానమైన 659 అమెరికా ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా కంటే ఓ అడుగు ముందుకేసిన చైనా.. 545 వస్తువులపై జులై 6, 2018 నుంచి ఈ అదనపు సుంకాన్ని వసూలు చేస్తామని చైనా కస్టమ్స్‌ టారిఫ్స్‌ కమిషన్‌ తెలిపింది. మిగిలిన 114 ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న టైంలోనే.. ఈ వివాదంలోకి భారత్ ను లాగింది అమెరికా. భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులపై అమెరికా సుంకాలను పెంచింది. అమెరికా నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నట్లు ఇండియాకూ సంచలన నిర్ణయం తీసుకున్నది. అదే స్ధాయిలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ఉత్పత్తులపై సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి అమెరికాకు షాక్ ఇచ్చింది. 30 రకాల ఉత్పత్తులపై 50 శాతం కస్టమ్స్‌ డ్యూటీని పెంచే ప్రతిపాదనను వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేన్ కు భారత్ తెలిపింది. భారత్ నిర్ణయంతో అమెరికాకు పెద్ద ఝలక్ తగిలిందనే చెప్పవచ్చు.

Posted in Uncategorized

Latest Updates