అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ : హాయ్‌ లాండ్‌ వేలానికి హైకోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది. అగ్రిగోల్డ్ కేసులో హాయ్‌ లాండ్‌ వేలానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది హైకోర్ట్. పిటిషన్‌ పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు వెల్లడించింది.  హాయ్‌ లాండ్‌ విలువ రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఖరారు చేసింది ఉన్నత న్యాయస్థానం. సీల్డ్‌ కవర్‌ లో బిడ్డర్స్‌ ను ఆహ్వానించాలని కోర్టు ఆదేశించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాలులోనే ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని తెలిపిన హైకోర్ట్.. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని చెప్పింది. అప్పడే బెయిల్‌ పిటిషన్‌ ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ఆదేశించింది ధర్మాసనం. విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates