అగ్రి చట్టాలపై కేంద్రం,రైతుల మధ్య మళ్లీ అసంపూర్తిగా ముగిసిన చర్చలు

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య ఇవాళ(శుక్రవారం) జరిగిన చర్చలు మళ్లీ అసంపూర్తిగా ముగాశాయి. చట్టాలను రద్దు చేయాలని రైతుల ప్రతిపాదనను కేంద్రం అంగీకరించలేదు.

కేంద్రం,రైతుల మధ్యఇప్పటి వరకు 9 విడతల చర్చలు ముగిశాయి. అయితే ఈ 9 చర్చల్లోనూ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జనవరి 19న మరో దఫా చర్చలు జరగనున్నట్లు ఇరు వర్గాలు ప్రకటించాయి. చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తుంటే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే డిమాండ్‌ను ఒప్పుకోబోమని, మరే అంశమూ చర్చించేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు.

అంతేకాదు…సుప్రీం కోర్టు నియమించిన ప్యానల్‌లో నియమించిన కమిటీ సభ్యులు..నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నారన్న రైతులు… కమిటీ ముందు తాము హాజరు కాబోమన్నారు. కేంద్రంతో జరిగిన చర్చల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. తాము కేంద్రంతో చర్చల్లోనే తేల్చుకుంటామని చెబుతున్నారు.

Latest Updates