అచ్చంగా అలాగే ఉన్నాయి : రూ.10 లక్షల దొంగ నోట్లు పట్టివేత

వలరా-యేొాతఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడింది. విశాఖపట్టణం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటె లిజెన్స్ (DRI) అధికారులు 10ల‌క్ష‌ల20 వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ఎక్స్ ప్రెస్ లో నకిలీ నోట్లను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. నకిలీ నోట్లన్నీ రెండు వేల రూపాయలేనని తెలిపారు.

త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు నిందితులు డీఆర్ఐ  విచారణలో తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా కరెన్సీని తరలిస్తున్నట్టు… ఎన్నికల్లో ఈజీగా నోట్ల మార్పిడి చేయవచ్చన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates