అచ్చం వాట్సాప్ లాగే : పతంజలి కింబో మెసేజ్ యాప్

patanjali-appబాబా రాందేవ్ తలచుకుంటే.. తిమ్మిని బమ్మి చేయగలరు.. యోగా పాఠాలు చెప్పే ఈయన ఇప్పుడు దేశ ప్రజల ఆహారపు అలవాట్లనే మార్చేస్తున్నారు. పతంజలి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి.. ఏడాది కాలంలోనే రూ.5వేల కోట్ల బిజినెస్ చేసి.. ప్రపంచ దేశాలను ఔరా అనిపించారు. ఒక్కొక్క రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న పతంజలి.. ఇప్పుడు టెలికాం రంగంలోకి కూడా వచ్చి జియోతోపాటు ఇతర కంపెనీలకు షాక్ ఇచ్చింది. పతంజలి సిమ్ కార్డులు చర్చ పూర్తవ్వకుండానే.. వాట్సాప్ కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చారు రాందేవ్ బాబా.

పతంజలి నుంచి వస్తున్న యాప్ పేరు కింబో. స్వదేశీ మెసెంజింగ్ యాప్ అంటూ అప్పుడే ప్రచారం మొదలెట్టేశారు. కింబో అనే పదం సంస్కృతం నుంచి తీసుకున్నారు. కింబో అంటే ఎలా ఉన్నావ్.. ఏంటి కొత్తగా అనే అర్థం వస్తోంది. అచ్చం వాట్సాప్ లాగే పని చేస్తోంది ఇది. గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. కాల్ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అతి త్వరలోనే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ios ఆపరేటింగ్ సిస్టమ్స్ లో పని చేస్తోంది.

వాట్సాప్ పైనే టార్గెట్ పెట్టిన పతంజలి కింబో యాప్.. పూర్తి స్వదేశీ పరిజ్ణానం అంటూ ప్రచారం మొదలుపెట్టేసింది. దేశీయ మెసెజింగ్ ప్లాట్ ఫాం కింబో యాప్ అంటూ ఓ వర్గం ప్రజలను నేరుగా టచ్ చేసే విధంగా వ్యూహాలు రచిస్తోంది. BSNL సహకారం, సాంకేతికతను తీసుకుంటోంది.

Posted in Uncategorized

Latest Updates