అచ్చం శ్రీదేవీలాగే ఉంది : NTRలో రకుల్ లుక్

క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఈ మూవీలో శ్రీదేవిగా రకుల్ నటించనుంది. ఇవాళ రకుల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు   సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో ఆకుచాటు పిందె తడిసే అనే పాటకు బాలయ్యతో స్టెప్పులు వేయనుంది రకుల్. రకుల్ లుక్ ను చూసి అచ్చం శ్రీదేవిలా ఉందంటున్నారు నెటిజన్లు.శ్రీదేవిగా ఆకట్టుకుంటున్న ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషాన్ని ప్యాన్స్ తో పంచుకుంది రకుల్. శ్రీదేవి క్యారెక్టర్ లో న‌టించ‌డం త‌న‌కు స‌వాల్ వంటిది అని ట్వీట్ చేసిన ర‌కుల్‌ పలు విషయాలను చెప్పుకొచ్చింది.

కోట్ల మంది ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రీదేవి పాత్ర‌ని పోషించ‌డం క‌త్తిమీద సాము వంటిందని.. దీనికి న్యాయం చేయ‌గ‌ల‌న‌ని భావిస్తున్నానని చెప్పింది. తనపై నిర్మాత‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయన‌ని.. గ‌తంలో ఎప్పుడు శ్రీదేవిని క‌ల‌వ‌ని తాను సినిమాల‌ని చూసి ఆమె హావ‌భావాలు ప‌లికించేందుకు ప్ర‌య‌త్నాస్తాను అని తెలిపింది.

శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన వారిని క‌లిసి అన్ని విష‌యాల‌ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాను అని తెలిపింది ర‌కుల్.  ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా దివి సీమీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది.  చంద్రబాబుగా రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates