అజ్ఞాతవాసులే అందరూ : ట్విట్టర్ కు రేణుదేశాయ్ గుడ్ బై

renuపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ను డిలీట్ చేశారు. గుడ్ బై చెప్పారు. రెండు రోజుల క్రితం ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయింది. ఈ ఫొటోలను స్వయంగా రేణూనే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పవన్ కూడా ట్విట్టర్ ద్వారా రేణూదేశాయ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే కొంతమంది మాత్రం రేణూదేశాయ్ మరొకరిని పెళ్లి చేసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది చంపేస్తామని కూడా రేణూని బెదిరించారు. ఈ సమయంలో తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ప్రైవసీ సెట్టింగ్ ను కూడా మార్చారు. అంతేకాకుండా ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేశారు. తన లైఫ్ లో కొత్త ఫేజ్ లోకి అడుగుపెట్టబోతున్నానని.. నెగెటివ్ కామెంట్లకు దూరంగా తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేస్తున్నట్లు రేణూ తన స్టేట్ మెంట్ లో తెలిపారు. అందరూ అజ్ణాతవాసులే ఇందులో ఉన్నారు.. ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడలేరు అంటూ చురకలు అంటించారు. కొంత మంది మారు పేర్లతో.. అజ్ణాతంలో ఉండి వ్యక్తులను, వారి ఆలోచనలను టార్గెట్ చేస్తూ ఉంటున్నారని తెలిపారు.
renu

Posted in Uncategorized

Latest Updates