అట్టర్ ఫ్లాప్ అంటే ఇదీ : రూ.700 కోట్లతో సినిమా తీస్తే.. 70 కోట్లే వచ్చాయి

అద్భుతమైన కథగా ఫీలయ్యారు.. ఆరేళ్లు తీశారు.. ఆరు దేశాల నటులు నటించారు.. 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. రెండున్నర గంటల సినిమా.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. జనంలో మూవీ ఫీవర్ వచ్చేసింది.. అడ్వాన్స్ బుకింగ్ కోసం ధియేటర్ల దగ్గర కొట్టుకున్నారు కూడా.. ఎట్టకేలకు జూలై 13వ తేదీ ఉదయం మొదటి ఆట పడింది.. బయటకు వచ్చినోళ్లు రెస్పాన్స్ తెలియకపోవటంతో.. రెండో ఆట జనం కూడా ధియేటర్లలోకి వెళ్లిపోయారు.. ఇక మూడో ఆట చూడాలి.. ప్రేక్షకులే టికెట్లు అమ్మటం మొదలుపెట్టారు.. రూ.500 టికెట్ ను.. 200 రూపాయలకే ఇస్తాం.. వెళ్లి సినిమా చూడండి అని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు బంరాఫర్ ఇచ్చారు.. ఎందుకో తెలుసా.. సినిమా అట్టర్ ఫ్లాప్.. అలాంటి ఇలాంటి ఫ్లాప్ కాదు.. డిజాస్టర్.. మూడో రోజు ధియేటర్ల నుంచి సినిమాను ఎత్తేశారు.. 700 కోట్ల బడ్జెట్ కు.. ఈ మూడు రోజుల కలెక్షన్ కేవలం రూ.70 కోట్లు మాత్రమే.. అంటే అక్షరాల రూ.630 కోట్లు నష్టపోయారు నిర్మాతలు. ఇది చైనా సినిమా. పేరు అసుర. తెలుగు టైటిల్ లాగే ఉన్నా.. అచ్చమైన చైనా కథ. మన బాహుబలి టైపులో ఉంటుంది కథ.

చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్‌ అనే ప్రముఖ సంస్థ అసుర సినిమాను తెరకెక్కించింది. టిబెటన్‌ బుద్దిస్ట్‌ పౌరాణిక కథ ఇది. వందల కోట్లతో భారీ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసమే రెండేళ్లు కష్టపడ్డారు. ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా.. 100 కోట్లతో సెట్టింగ్స్ వేశారు. అలనాటి దుస్తులు, అలంకరణల కోసమే మరో 100 కోట్లు ఖర్చు చేశారు. అసుర సినిమా.. ప్రపంచ రికార్డ్స్ బద్దలు కొడుతుందని ఆశిస్తే.. అట్టర్ ఫ్లాప్ కావటాన్ని యూనిట్ జీర్ణించుకోలేకపోతోంది. చైనీయులు ఇంతలా తిరస్కరించటానికి కారణం ఏంటో కూడా అర్థం కాక తల పట్టుకుంటున్నారు నిర్మాతలు. అసుర సినిమాను ప్రదర్శించలేం అంటూ థియేటర్ల యజమానులు ప్రకటించటం మరో సంచలనం. చైనాలోనే ఇంత బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఇదే. అసుర రాకముందు.. అత్యధిక మూవీ బడ్జెట్ 300 కోట్లుగానే ఉంది. సంస్కృతి, సంప్రదాయాలపై తీసిన ఈ సినిమాను చైనీయులు ఇంతలా తిరస్కరిస్తారని ఊహించలేదు అంటున్నారు నిర్మాత యాంగ్‌ హోంగ్‌ టావో. ప్రపంచంలోనే ఐదు డిజాస్టర్ మూవీస్ లో ఇప్పుడు అసుర ఫస్ట్ ప్లేస్ లో ఉంది..

ఈ సమాచారంపై నెటిజన్లు వింత వింతగా స్పందిస్తున్నారు. కష్టాలు పూడ్చుకోవాలంటే చైనా వస్తువుల్లా టికెట్ ధరను 5, 10 రూపాయలు పెట్టండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇండియాలో రిలీజ్ చేస్తే మేం హిట్ చేస్తాం అని మరికొందరు వెటకారాలు ఆడుతున్నారు. ఇంకొందరు అయితే మీ వస్తువులతో మా దగ్గర ధరలు దిగి వచ్చాయి.. ఆ క్రుతజ్ణతతో అయినా మీ సినిమాను హిట్ చేస్తాం అని అంటున్నారు..

Posted in Uncategorized

Latest Updates