అట్టర్ ఫ్లాప్ అయిన ఉత్తర కర్ణాటక బంద్

ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిర్వహించిన బంద్ అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు బంద్ కు ప్రజలు స్పందించలేదు. బంద్ కు పిలుపునిచ్చిన వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలు ఉదయం కొద్దిగా హడావుడి చేసినా… తర్వాత వారు కూడా సైలెంట్ అయ్యారు. 13 జిల్లాలతో ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం కోసం ఉత్తర్ కర్ణాటక రైత సంఘ నిర్వహించిన బంద్ విఫలమైంది. జనం బంద్ ను పట్టించుకోలేదు. ఉదయం కర్ణాటక రైత సంఘ కార్యకర్తలు బస్ డిపోలు దగ్గర  బైఠాయించారు. కొద్దిసేపు దుకాణాలు మూయించారు. కొందరు కార్యకర్తలు వివిధ పట్టణాల్లో ర్యాలీలు తీశారు. ఆందోళన ప్రదర్శనలు కూడా సింబాలిక్ గా జరిగాయి. బంద్ ను సమర్థవంతంగా అదుపు చేసింది JDS-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం.

ఉత్తర్ కర్ణాటక ప్రత్యేక రాజ్య పోరాట సమితి బంద్ పిలుపు విత్ డ్రా చేసుకుంది. తమ ప్రధాన డిమాండ్లను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న హామీ ఇవ్వడంతో బంద్ పిలుపును ఉపసంహరించుకుంది. అయితే కర్ణాటక రైత సంఘ మాత్రం బంద్ ను కొనసాగించింది. తమకు 23 సంఘాల సపోర్ట్ ఉందని రైత సంఘ ప్రకటించుకున్నా… గ్రౌండ్ లెవెల్లో అదెక్కడా కనిపించలేదు. ట్రేడ్ యూనియన్లు, అనేక కన్నడ సంస్థలు బంద్ కు మద్దతు ప్రకటించినా… వ్యాపారులు, ప్రజలు లైట్ తీసుకున్నారు.  ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజాజీవితం నార్మల్ గానే సాగింది.

బంద్ కు స్పందన లేకపోవడం తన విధానాలు కరెక్ట్ అని నిరూపించిందని సీఎం కుమారస్వామి అన్నారు. వచ్చే రెండు నెలల్లో ఆ 13జిల్లాల్లో పర్యటించనున్నట్టు కుమారస్వామి తెలిపారు. బీజేపీనే వెనకుండి బంద్  చేయిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్, JDS నేతలు. ఆరోపణలను ఖండిస్తున్న బీజేపీ నేతలు… కర్ణాటక విభజనకు తాము వ్యతిరేకమంటున్నారు. రాష్ట్ర విభజన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేతలను హెచ్చరించారు యడ్యూరప్ప.

Posted in Uncategorized

Latest Updates