అట్టహాసంగా.. శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభం

shiva
మంచు క్రీడల ఆరంభం నింగినంటింది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ లో శుక్రవారం(ఫిబ్రవరి-9) శీతాకాల ఒలింపిక్స్‌ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎముకలు కొరికే చలి రాత్రిలో బాణా సంచా పేలుళ్లు మిన్నంటాయి. ఆకాశం హరివిల్లులా మారింది. మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో మంచు కాంతులను దశ దిశలా చాటేందుకు స్నేహాన్ని పెంపొందించేందుకా అన్నట్లు తారా జువ్వలు నింగి ఎగిశాయి. క్రీడలకు అతిథ్యం ఇస్తున్న ప్యొంగ్‌ చాంగ్‌ సందర్శకులతో నిండిపోయింది. నిర్వాహకులు క్రీడాకారులకు హీట్‌ ప్యాక్స్‌, దుప్పట్లు, టోపీలు పంపిణీ చేశారు. క్రీడల మస్కట్లుగా సూహర్యాంగ్‌ (తెల్ల పులి) బండబి (నల్ల ఎలుగుబంటి)లు ప్యొంగ్‌చాంగ్‌లో క్రీడాకారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రీడల ప్రారంభానికి హాజరైన దేశాధినేతల హృదయాల్లో ఆనందం ఉప్పొంగింది 17 రోజులపాటు జరగనున్న ఈ క్రీడలు అన్ని దేశాల క్రీడా అభిమానులను అలరించనున్నాయి.

ఆరోసారి శీతాకాల ఒలింపిక్స్ లో పోటీపడుతున్న భారత ఆటగాడు శివ కేశవన్ మువ్వన్నెల జెండాతో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నాడు.

Posted in Uncategorized

Latest Updates