అడవుల్లో ఆహార కొరత: ప్రమాదాల బారిన పులులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులులకు రక్షణ లేకుండా పోతుంది. కొద్దిరోజుల క్రితం నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి శివారులో వేటగాళ్లు అమర్చిన బోనులో…చిరుత కాలు చిక్కుకొని తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు… అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మత్తు మందు ఇచ్చి.. చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్ జూ పార్క్ కు తరలించారు.

ఇక నాగ్ పూర్- హైదరాబాద్ వెళ్ళే 44వ నంబరు జాతీయ రహదారిపై ఎక్కువగా వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. 2 నెలల క్రితం ఇందల్వాయి మండల కేంద్రంలో రోడ్డును దాటుతున్న చిరుతను లారీ ఢీ కొనడంతో చనిపోయింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్దపులి, 14 చిరుత పులులున్నట్లు అధికారులు గుర్తించారు.

అడవుల్లో సరైన ఆహారం, నీళ్లు లేక ఇలా గ్రామాల పరిసర ప్రాంతాల్లోకి పులులు వస్తున్నాయి. 2 నెలల క్రితం నవీపేట మండలం అబ్బాపూర్  గ్రామ శివారులో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయపడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు…చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates