అడిగితే కొట్టించింది : సూపర్ మార్కెట్ లో లేడీ పోలీస్ చోరీ

 ఓ సూపర్ మార్కెట్లో చోరీకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళా కానిస్టేబుల్. చోరీకి పాల్పడిన ఆమెను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు సూపర్ మార్కెట్ సిబ్బంది. అయితే నన్నే దొంగ అంటూ నిలదీస్తారా అంటూ ఆ కానిస్టేబుల్ రెచ్చిపోయింది. ఈ ఘటన బుధవారం(జులై-25) ఉదయం  చెన్నై సిటీలో జరిగింది.

చెన్నై లోని G1 పోలీస్ స్టేషన్ లో నందిని అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. బుధవారం(జులై-25) ఉదయం షాపింగ్ కోసం సిటీలోని ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. అయితే షాపింగ్ చేస్తున్న సమయంలో….ఫోన్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఓ వస్తువును ప్యాంట్ జేబులో పెట్టేసుకుంది.  దీన్ని గమనించిన ప్రణవ్ అనే స్టోర్ ఉద్యోగి  ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఓ కానిస్టేబుల్ అయి ఉండి ఇటువంటి పనులేంటని ఆమెను ప్రశ్నించాడు. స్టోర్ లోని వస్తువులను దొంగిలించినందుకుగాను  క్షమాపణ లెటర్ రాయాలని ఆమెకు తెలిపాడు. దీంతో నన్నే నిలదీస్తావా అంటూ స్టోర్ ఉద్యోగి ప్రణవ్ పై చిందులేసింది లేడీ కానిస్టేబుల్ నందిని.

తనను స్టోర్ లో అవమానించారంటూ విషయాన్నివెంటనే   తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది లేడీ కానిస్టేబుల్ నందిని. వెంటనే కొంతమంది వ్యక్తులతో కానిస్టేబుల్ భర్త స్టోర్ కి చేరుకొని…..నా భార్యనే ప్రశ్నిస్తారా, పోలీస్ కానిస్టేబుల్ అంటే భయం లేదా మీకు అంటూ స్టోర్ ఉద్యోగి ప్రణవ్ పై  కర్రలు, రాడ్లతో దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేశారు.   తీవ్రగాయాలపాలైన స్టోర్ ఉద్యోగి  ప్రణవ్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నాడు. దెబ్బలు బాగా తగిలాయని.. కోలుకోవటానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.  ఈ వ్యవహారంపై స్పందించిన  పోలీస్ ఉన్నతాధికారులు…… పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates