అడిగినా చెప్పొద్దు : మొబైల్ కంపెనీలకు ఆధార్ అవసరం లేదు

aadhar-mobile-numberమీకు మొబైల్ సిమ్ కావాలంటే వెంటనే ఆధార్ నెంబర్ చెప్పండి అంటారు.. సిమ్ మార్చుకోవాలని అనుకున్నారు.. వెంటనే ఆధార్ నెంబర్ చెప్పండి అంటారు.. సిమ్ అడ్రస్ మార్చాలన్నా ఆధార్.. ఇలా మొబైల్ కంపెనీలన్నీ ఆధార్ మస్ట్ అంటూ పీడించుకుతిన్నాయి ఇన్నాళ్లు.. ఇక నుంచి ఆ అవసరం లేదంటోంది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. టెలికాం కంపెనీల జాబితా నుంచి ఆధార్ అనే కాలమ్ ను తొలగించేశారు. అవును ఇది నిజం. మొబైల్ నెంబర్ కావాలంటే.. ఆయా కంపెనీలు 29 కాలమ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆధార్ కాలం కూడా ఉంది.. ఇక నుంచి ఆ కాలమ్ లేదని స్పష్టం చేసింది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జూలై ఒకటో తేదీ నుంచి మొబైల్ కంపెనీలు విధిగా వర్చ్యువల్ ఐడీ తీసుకోవాల్సిందే. ఆధార్ నెంబర్ అడిగే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది. ఇకపై ఆధార్‌ బదులు VID తెలిపితే సరిపోతుంది. ఈ విధానం జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.  ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి ఆర్ధిక లావాదేవీలను ట్రాక్ చేయబోమంది.

VID లాగిన్ కోసం..

  • httph://uidai.gov.in లో ఆధార్ ఆన్ లైన్ సర్వీసెస్ విభాగంలో ఆధార్ సర్వీసెస్ లో వర్చువల్ ఐడీ(VID) జనరేటర్ ను ఎంచుకోవాలి
  • కొత్తగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ లను పూరిస్తే…మొబైల్ నంబరుకు OTP వస్తుంది.
  • ఆ తర్వాత అదే పేజీలో OTPని ఎంటర్ చేసి జనరేట్ VID అనే బటన్ ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి
  • ఆ వెంటనే మొబైల్ నంబరుకు వర్చువల్ ఐడీ వస్తుంది
  • VIDని మర్చిపోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది. ఒక వేళ మర్చి పోయినా VIDని మళ్లీ పొందే అవకాశముంది.
Posted in Uncategorized

Latest Updates