అడిలైట్ టెస్ట్: ఆసీస్ టార్గెట్ 323

అడిలైడ్ వేదికగా భారత్,ఆసీస్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 307 రన్స్ కు ఆలౌటైంది. 151/3 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ అదనంగా 156 రన్స్ చేసింది. పూజారా(71),ఆజింక్యా రహానే(70) తమ బ్యాట్ కు పనిచెప్పడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. దీంతో భారత్ ఆసీస్ ముందు 323 రన్స్ టార్గెట్ ను ఉంచింది. ఆసీస్‌ బౌలర్లలో లైయన్‌ ఆరువికెట్లు తీయగా.. స్టార్క్‌ 3, హేజిల్‌ వుడ్‌ ఒక వికెట్‌ తీశారు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 235 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది . దీంతో టీమిండియాకు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 15 రన్స్ లీడ్ లభించింది.

Posted in Uncategorized

Latest Updates