అడిలైడ్ టెస్ట్: ఫస్ట్ డే.. భారత్ 250/9

అడిలైడ్ వేదికగా ఆసీస్ తో ఇవాళ(డిసెంబర్ 6) ప్రారంభమైన ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా చెప్పుకోదగ్గ స్కోర్ సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 250 రన్స్ చేసింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా..  టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో లంచ్ టైంకు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 56 రన్స్ మాత్రమే చేసింది.నాలుగు వికెట్లు కోల్పోయిన టైంలో క్రీజ్ లోకి వచ్చిన  రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు టీంను ఆదుకునే ప్రయత్నం చేశారు.

తర్వాత వీరిద్దరూ ఔటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఛటేశ్వర్ పూజారా తన సూపర్ సెంచరీ(123)తో టీమిండియాను ఆదుకున్నాడు. ఈ సెంచరీతో పూజారా తన టెస్ట్ కెరీర్ లో 16వ సెంచరీని కంప్లీట్ చేశాడు.ఒకవైపు పేస్‌ అటాక్‌ను, మరొకవైపు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్‌ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. భారత టీంలో లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), పూజారా(123), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25), అశ్విన్(25), ఇషాంత్ శర్మ(4) రన్స్ చేశారు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో షమీ (6), బుమ్రా (0) ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్లలో, మిచెల్ స్టార్క్,హాజిల్‌వుడ్‌, పాట్ క‌మిన్స్ , నాథన్ లియాన్‌ రెండేసి వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates