అడిలైడ్ టెస్ట్ : భారత్-151/3

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టు మ్యాచ్‌ లో టీమిండియా పట్టుబింగించింది. మూడో రోజు డిసెంబర్ 08న ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా(40 బ్యాటింగ్‌; 121 బంతుల్లో 4 ఫోర్లు), రహానే(1 బ్యాటింగ్‌; 15 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. శనివారం భారత ఇన్నింగ్స్‌ను మురళీ విజయ్‌-KL రాహుల్‌ కుదురుగా ప్రారంబించారు.

టీమిండియా ఫస్ట్ వికెట్‌ కు 63 రన్స్ జత చేసిన తర్వాత మురళీ విజయ్‌(18) పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో రాహుల్‌(44; 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఔట్ కావడంతో భారత్‌ 76 రన్స్ దగ్గర సెకండ్ వికెట్‌ ను కోల్పోయింది. చతేశ్వర పుజారా-విరాట్‌ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దింది. ఈ జోడి 71 పరుగులు భాగస్వామ‍్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి(34;104 బంతుల్లో 3 ఫోర్లు) మూడో వికెట్‌ గా ఔటయ్యాడు.

191/7 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఫస్ట్ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. మరో 44 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లును కోల్పోయింది. ఓవర్‌ నైట్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ ను బూమ్రా ఔట్‌ చేయగా, చివరి రెండు వికెట్లను షమీ తీశాడు. ట్రావిస్‌ హెడ్‌(72) తొమ్మిదో వికెట్‌ గా ఔట్‌ కాగా, హజల్‌ వుడ్‌(0) ఆఖరి వికెట్‌ గా పెవిలియన్‌ బాటపట్టడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 235 పరుగుల వద్ద ముగిసింది. భారత్‌ కు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైంది.

 

Posted in Uncategorized

Latest Updates