అడిలైడ్ టెస్ట్ మనదే : ఆస్ట్రేలియాపై ఇండియా విక్టరీ

అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది టీమిండియా. 31 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది కోహ్లీ సేన. 323 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో 291 రన్స్ కి ఆలౌట్ చేసింది భారత్.  చివరివరకు పోరాడినప్పటికీ సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.

భారత బౌలర్లలో అశ్విన్-3, బుమ్రా-3, ఇషాంత్ 1 వికెట్లు తీశారు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ 1-0 లీడ్ లో ఉంది. టెస్టుల్లో పదేళ్ల తర్వాత అడిలైడ్ గడ్డపై భారత్ కు ఇదే ఫస్ట్ విక్టరీ. తొలి ఇన్నింగ్స్ సెంచరీ(123), రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ(71) చేసిన చటేశ్వర్ పుజారాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ వరించింది.

భారత్ స్కోర్-250, 307
ఆస్ట్రేలియా స్కోర్-235, 291

Posted in Uncategorized

Latest Updates