అడిలైడ్ టెస్ట్: లంచ్ టైంకు భారత్ 56/4

అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. అయితే ప్రారంభంలోనే భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు చేరుకున్నారు. లంచ్ టైంకు నాలుగు వికెట్లు కోల్పోయి 56 రన్స్ చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) రన్స్ చేసి ఔటయ్యారు. ఆస్రేలియా బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు వికెట్స్ ద‌క్క‌గా, స్టార్క్‌, క‌మిన్స్ చెరో వికెట్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates