అడిలైడ్ టెస్ట్: సెకండ్ డే.. ఆసీస్ 191/7

అడిలైడ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది. భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. ఆసీస్‌ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరుతున్నప్పటికీ ట్రావిస్‌ హెడ్‌ హాఫ్‌ సెంచరీతో టీంను ఆదుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఆస్ట్రేలియా 59 రన్స్ వెనుకబడి ఉంది. హెడ్ 61, స్టార్క్ 8 రన్స్ తో క్రీజులో ఉన్నారు. అశ్విన్ 3 వికెట్లు తీయగా,  ఇషాంత్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకు ఆలౌటవ్వటంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆసీస్  సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

 

Posted in Uncategorized

Latest Updates