అడిలైడ్ టెస్ట్ : 6 వికెట్లు తీస్తే విజయం మనదే..

అడిలైడ్‌:  టీమిండియా నాలుగో రోజు మ్యాచ్ లో విక్టరీని తమ వైపు తిప్పుకుంది. మరో ఆరు వికెట్లు తీస్తే చాలు విజయం మనదే. చివరి రోజైన సోమవారం డిసెంబర్ 10న మరో ఆరు వికెట్లు తీస్తే టీమిండియాను విజయం వరించనుంది. నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 307 రన్స్ కు ఆలౌటై, ఆసీస్‌ కు 323 పరుగుల టార్గెట్‌ ను ముందుంచింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 104/4తో నిలించింది.

మూడో రోజు వర్షం కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి నాలుగో రోజు అరగంట ముందే ఆటను ప్రారంభించారు. పుజారా, రహానేలు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ క్రమంలోనే రహానె, పుజారా హాఫ్ సెంచరీలతో రాణించారు. రోహిత్‌ (1), పంత్‌ (28), షమీ (0) లియాన్‌ బౌలింగ్‌లో, అశ్విన్‌ (5), ఇషాంత్‌ (0)లు స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు.

323 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్‌, హారిస్ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. అశ్విన్ బౌలింగ్‌ లో ఫించ్‌ (11) రూపంలో భారత్‌ కు ఫస్ట్ వికెట్‌ లభించింది. అ తర్వాత వెంటనే మరో ఓపెనర్‌ హారిస్‌ (26) షమీ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు యత్నించి కీపర్‌ క్యాచ్‌ గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఖవాజ (8), హాండ్స్‌ కాంబ్‌ (14) వికెట్లను తీయడానికి ఎంతో సమయం పట్టలేదు. అశ్విన్‌, షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాన్‌ మార్ష్‌ (31), ట్రావిస్‌ హెడ్ (11) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆసీస్‌ గెలవాలంటే మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా..భారత్ విక్టరీకి 6 వికెట్లు తీయాల్సి ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates