అడుగులు పడ్డాయి : ఆ నాలుగు బ్యాంకులు విలీనం

banks
నాలుగు స్టేట్ రన్ బ్యాంకులు.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI లను విలీనం చేసేందుకు గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈ నాలుగు బ్యాంకులు విలీనం అయితే  దేశంలో SBI తర్వాత 16.58 లక్షల కోట్ల కంబైండ్ ఆస్తులతో రెండో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించనుంది. గత ఏడాదిగా నష్టాలను చవిచూస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను క్లోజ్ చేయడం లేదా విలీనం చేయడం ద్వారా బ్యాంకుల సంఖ్యను తగ్గించాలనేది కేంద్రం ఆలోచన. ఇందులో భాగంగానే బ్యాంకింగ్ సెక్టార్ లో ఏకీకరణ విధానాన్ని చేపట్టే విధంగా చర్యలు చేపడుతుంది. మార్చి-31, 2018 నాటికి ఈ నాలుగు బ్యాంకుల కంబైండ్ నష్టం రూ.21వేల 646.38 కోట్లుగా ఉంది. దీంతో ఈ నాలుగు బ్యాంకుల విలీనం ఆలోచనకి పునాది పడింది.

ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI)లో అనుబంధ బ్యాంకులన్నీ విలీనం అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తోపాటు ఇతర బ్యాంకులను విలీనం చేశారు. ఇప్పుడు ఈ 4 బ్యాంకులను విలీనం చేయటం ద్వారా.. బ్యాంకింగ్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించొచ్చు అని భావిస్తోంది కేంద్రం.

Posted in Uncategorized

Latest Updates