అడ్డమైనవన్నీ పెట్టేశాడు : ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ హ్యాక్

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. మంగళవారం(జులై-10) రాత్రి కొన్ని నిమిషాలపాటు హ్యాకింగ్ కు గురైంది, దీనిపై విచారణకు ఆదేశించినట్లు బుధవారం(జులై-11) ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

మంగళవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు వివిధ మెసేజ్ లు పోస్ట్ చేశారు. చాలా సమయంపాటు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని, అయితే వెంటనే పాస్ వర్డ్ ని మార్చడంతో కొన్ని నిమిషాల్లోనే పునరుద్దరించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబర్ సెల్ కు కంప్లెయింట్ ను ఫార్వాడ్ చేశామని, హ్యాకింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే పోలీసుల ట్విట్టర్ లనే హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేయగల్గుతున్నప్పుడు ఇక సామాన్యుల పరిస్ధితి ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం, ఇతరుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ పలువురు సైబర్  నేరాలకు పాల్పడుతున్నారని, వెంటనే ఓ పటిష్ఠ భద్రత విధానాన్ని తీసుకువచ్చి, హ్యాకర్ల బారి నుంచి కాపాడాలని నెటిజన్లు కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates