అడ్మిషన్ల కోసం బారులు : రాజ్ భవన్ స్కూల్ కి ఫుల్ డిమాండ్

RJ SCHOOLతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సర్కార్ స్కూల్స్ లో చదివే విద్యార్థుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్, బాలికలకు హెల్త్ కిట్స్ లాంటి సరికొత్త పథకాలను ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సధుపాయాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ సంవత్సరం సర్కార్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పోటీ బాగా పెరిగింది.

శుక్రవారం (జూన్-1) సమ్మర్ సెలవులను పూర్తి చేసుకుని రాష్ట్రంలోని స్కూల్స్ అన్నీ రీ ఓపెన్ అయ్యాయి. స్కూల్స్ ప్రారంభం అనే న్యూస్ రావడమే ఆలస్యం. విద్యార్ధుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం సర్కార్ స్కూల్స్ వద్ద బారులు తీరారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్ వద్ద అడ్మిసన్ల కోసం భారీగా పబ్లిక్ చేరారు. కార్పొరేట్ కు మించి రాజ్ భవన్ ఉన్నత పాఠశాలను నిర్మించారు. దీంతో పరిసరాల విద్యార్థుల తల్లిదండ్రుల కన్ను ఈ స్కూల్ పై పడింది. పైగా ఈ సారి పరీక్ష ఫలితాలు కూడా మెరుగ్గా కనిపించాయని చెబుతున్నారు ఈ స్కూల్ లో  చదివిన స్టూడెంట్స్. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.  ప్రైవేట్ స్కూల్స్ లో వేలకు వేలు ఫీజులు కట్టలేని వారు, ప్రభుత్వ స్కూల్సే బెటర్ అనుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, అన్ని స్కూల్స్ కూడా రాజ్ భవన్ స్కూల్ లాగే తీర్చి దిద్దితే ..సీఎం కేసీఆర్ కలలు సాకారమవుతాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

Posted in Uncategorized

Latest Updates