అడ్మిషన్ కొట్టు..బీమా పట్టు :  పీజీ విద్యార్థులందరికీ వర్తింపు

వరంగల్ : పీజీలో అడ్మిషన్లు పెంచేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ.  పీజీలో చేరిన విద్యార్థులందరికీ ఫ్రీగా యాక్సెడెంట్ ఇన్స్‌ రెన్స్‌ ను కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నేషనల్‌ ఇన్స్‌రెన్స్‌ గ్రూప్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వర్సిటీ పరిధిలోని ఏ కాలేజీలో అడ్మిషన్‌ పొందినా.. అందరూ అర్హులే. ప్రతి ఏడాది పీజీ సెట్‌ లో అడ్మిషన్‌ సందర్భంలోనే విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా రూ.62లు(GST సహా) తీసుకుంటారు.

ఇది రెండేళ్ల పీజీ కోర్సుకు వర్తిస్తుంది. వర్సిటీలోని అన్ని కాలేజీల్లో చదివే 10వేల మంది విద్యార్థులు ఈ స్కీంలో లబ్ది పొందే అవకాశం ఉంది. వర్సిటీ పరిథిలోని ఆదిలాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు కరీంనగర్‌ లోని శాతవాహన వర్సిటీ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌ లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినా..శాశ్వత అంగవైకల్యం కలిగినా,  మరణించిన..డాక్యుమెంట్ లో ఉన్న విధంగా డబ్బును ఇన్సురెన్స్ గా  పొందవచ్చు. గతంలో వర్సిటీలో చదువుతూ.. అనారోగ్యానికి గురికావడం, అలాగే కెనాల్‌ తో చనిపోవడం, బాత్‌ రూంలో పడి చనిపోయిన విద్యార్థులకు సహాయం చేయాలని ..వర్సిటీ ఎదుట వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వర్సిటీ అధికారులు ప్రత్యేక చోరువ తీసుకుని ఇన్స్‌ రెన్స్‌ సౌకర్యం కల్పించారు. వర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఖచ్చితంగా ఇన్స్‌ రెన్స్‌ ఉంటుందని తెలిపారు కేయూ డైరెక్టర్‌ అడ్మిషన్స్‌ మనోహర్‌.

 

Posted in Uncategorized

Latest Updates