అడ్వానీతో మోడీ భేటీ

modi-adwani2019 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎల్‌కే అడ్వానీ లాంటి సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలో నిలబెట్టాలనే అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రధాని మోడీ ఇటీవల ఈ విషయంపై అడ్వానీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా దీనిపై అడ్వాణీతో చర్చలు జరిపినట్లు మీడియాలో వార్త కథనాలు వచ్చాయి. అయితే 75ఏళ్ల పైబడిన వారిని ఎన్నికలు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ ఈ మధ్య కాలంలోనే నిర్ణయం తీసుకుంది.  అయితే గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఆ నిబంధనను సడలిస్తూ తాజాగా అడ్వాణీ, జోషీలను వచ్చే ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది.

గత కొన్ని రోజులుగా ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం ఏర్పడింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేకు దూరమవగా.. శివసేన, మరిన్ని మిత్ర పక్షాలు కూడా కూటమి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్‌ నేతలైన అడ్వాణీ, జోషీలను మళ్లీ ఎన్నికల కార్యకలపాల్లో భాగం చేయడంతో వారు బీజేపీ, మిత్రపక్షాల మధ్య వారధిగా ఉండే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates