అడ్వాన్స్ రిజర్వేషన్ : సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఇవే

dc-Cover-jndc9lq4vp27cbs7gdb3np2jf7-20170519070834.Mediవేసవిలో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. సమ్మర్ హాలీడేస్ కావడంతో ప్రయాణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దీంతో ఈసారి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే CPRO ఉమాశంకర్‌కుమార్‌.

ట్రైన్స్ షెడ్యూల్ వివరాలు

సికింద్రాబాద్‌– దర్భంగా(07007/07008) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 3, 7, 10, 14, 17, 21, 24, 28, మే 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29, జూన్‌ 2, 5, 9, 12, 16, 19, 23, 26, 30వ తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు మధ్యాహ్నం 1.45కి దర్భంగా చేరుకుంటుంది. ఏప్రిల్‌ 6, 10, 13, 17, 20, 24, 27, మే 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29, జూన్‌ 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29, జూలై 3వ తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఇది కాజీపేట్, రామగుండం మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.

హైదరాబాద్‌–రెక్సాల్‌ ప్రత్యేక రైలు.. 
హైదరాబాద్‌–రెక్సాల్‌(07005/07006) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28వ తేదీల్లో రాత్రి 9.30కి నాంపల్లి నుంచి బయలుదేరి రెండవ రోజు సాయంత్రం 5.30కి రెక్సాల్‌ చేరుకుంటుంది. ఏప్రిల్‌ 8, 15, 22, 29 మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24, జూలై 1వ తేదీల్లో తెల్లవారుజామున 1.30కి రెక్సాల్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.15కి నాంపల్లి చేరుకుంటుంది. ఇది కాజీపేట్, మంచిర్యాల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.

హైదరాబాద్‌–ఎర్నాకులం మార్గంలోనూ.. 
హైదరాబాద్‌–ఎర్నాకులం(07117/07118) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27వ తేదీల్లో మధ్యాహ్నం 12.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30కి ఎర్నాకులం చేరుకుంటుంది. ఏప్రిల్‌ 5, 12, 19, 26, మే 3, 10, 17, 2, 31, జూన్‌ 7, 1, 21, 28వ తేదీల్లో రాత్రి 9.45కి ఎర్నాకులం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కి నాంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, పిడుగురాళ్ల మార్గంలో నడుస్తుంది.

Posted in Uncategorized

Latest Updates