అణుయుద్దం జరగాల్సిందే : pokపై సంచలన వ్యాఖ్యలు చేసిన సైఫుద్దీన్

siపాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ సైఫుద్దీన్ సోజ్. భారత్-పాక్ ల మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే తప్ప POK భారత్ లో భాగమవదన్నారు. పీవోకే భారత్ సొంతమవ్వాలంటే రెండుదేశాల మధ్య అణుయుద్దం తప్పనిసరి అని ఆయన తెలిపారు. పాక్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ వర్కబుల్ సొల్యూషన్ చెప్పారన్నారు. భారత్ కాశ్మీర్ వ్యాలీని పాలిస్తున్నట్లుగానే పాకిస్ధాన్ కూడా pok ని పరిపాలిస్తుందన్నారు.మరోవైపు కశ్మీర్ ప్రజలు పాకిస్ధాన్ లో కలవాలనుకోవలేదని, మొదట తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారని పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ సైఫుద్దీన్ శుక్రవారం(జూన్-22) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్ధాయిలో మండిపడింది. అయితే కశ్మీర్ లో ఆర్మీ ఆపరేషన్ల వల్ల టెర్రరిస్టుల కంటే సామాన్యప్రజలే ఎక్కువగా చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గులాంనబీ ఆజాద్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates