అతిగా ఆలోచించొద్దు.. మానసికంగా వీక్ అవుతారు

 అతిగా ఆలోచించడం వల్ల ఉన్నట్టుండి కొంతమందికి మానసిక స్థితి మారిపోతుంటుంది. అప్పటివరకూ సంతోషంగా ఉన్నవారు వెంటనే ఏదో కోల్పోయిన వారిలా మారిపోతారు. అలాంటప్పుడు శారీరక శ్రమతో మానసిక స్థితి మెరుగు పరుచుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జాన్స్‌ హాప్‌ కిన్స్‌ బ్లూ మ్‌ బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న 54 మంది రోజువారీ కార్యకలాపాలను ఒక ట్రాకర్‌‌ సాయంతో పర్యవేక్షించారు. వీరు రోజులో ఎక్కువ సమయం శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే పనిగా చదివే వారు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సాఫ్ట్‌‌వేర్‌‌ రంగంలో పని చేసేవారు పని ఒత్తిడి కారణంగా మెంటల్‌ స్ట్రెస్‌ కి గురవుతుంటారు. కొంతమంది తాము అనుకున్నపని సాధించలేకపోయినా కూడా మానసికంగా క్రుంగిపోతుంటారు. వీళ్లంతా శారీరకంగా ఎంత కష్ట పడితే అంత మేలు. అందుకే రోజూ కొంతైనా శ్రమిస్తే అది మీకే మేలు అంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates