అతిగా బిహేవ్ చేశారు : వినోద్ కాంబ్లీ భార్యపై పోలీస్ కేసు

Kambli and wifeమాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యపై పోలీస్ కంప్లయింట్ ఫైల్ అయ్యింది. బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి ఈ ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. ముంబై ఇనార్బిట్ మాల్ లో ఆదివారం ఓ ప్రోగ్రామ్ జరిగింది. దీనికి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతోపాటు అతని భార్య ఆండ్రియా కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ, అతని తండ్రి కూడా పాల్గొన్నారు. ఓ అంశంపై వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా.. అంకిత్ తో వాదనకు దిగారు. మాట మాట పెరిగింది. సహనం కోల్పోయిన ఆండ్రియా.. అంకిత్ పై చేయిచేసుకున్నది. ఈ మేరకు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు అంకిత్ ఫాదర్. దీనిపై కాంబ్లీ కూడా స్పందించాడు. ఆండ్రియా చేయి పట్టుకున్నాడని.. అసభ్యకరంగా ప్రవర్తించటంతోనే చేయి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మొదటగా అంకిత్ తండ్రి నుంచి ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు కాంబ్లీ ఫ్యామిలీ మాత్రం ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. అంకిత్ వ్యవహరించిన తీరుపైనా ఆండ్రియా కంప్లయింట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates